Doctor Halchal: తాను తెచ్చుకున్న మద్యం తాగేందుకు.. రెస్టారెంట్ వాళ్లు అనుమతి ఇవ్వలేదని ఓ డాక్టర్.. కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటుచేసుకుంది. పట్టణ సమీపంలోని ఓ రెస్టారెంట్‌కి.. అనుమలవీడు పీహెచ్సీ ప్రభుత్వ వైద్యుడు భానుకుమార్ రెడ్డి వచ్చాడు.
"నన్ను మందు తాగనివ్వరా..?" కత్తితో డాక్టర్ హల్చల్..!
Doctor Halchal: ఓ వ్యక్తి భోజనం కోసం రెస్టారెంట్‌కు వచ్చాడు. తనకు కావాల్సిన వాటిని ఆర్డర్ పెట్టాడు. చిన్నగా తనతో తెచ్చుకున్న మందు సీసాని తాగడానికి బయటికి తీశాడు. అది గమనించిన రెస్టారెంట్ నిర్వాహకుడు.. ఇది రెస్టారెంట్ అనీ, ఇక్కడ మద్యం తాగడానికి అనుమతి లేదని చెప్పాడు. దాంతో కోపం తెచ్చుకున్న సదరు వ్యక్తి.. విచక్షణ కోల్పోయాడు. రెస్టారెంట్లో కూరగాయలు కోయడానికి సిద్ధంగా ఉన్న కత్తి తీసుకొని సిబ్బందిపై దాడికి యత్నించాడు..!
భోజనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత తనతోపాటు తెచ్చుకున్న మందు బయటికి తీశాడు. ఇది చూసిన రెస్టారెంట్ యాజమాన్యం.. ఇక్కడ మందు తాగడానికి అనుమతి లేదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన సదరు డాక్టర్.. రెస్టారెంట్లో కూరగాయలు కోసేందుకు సిద్ధంగా ఉన్న కత్తి తీసుకుని సిబ్బందిపై దాడికి యత్నించాడు. భానుకుమార్ రెడ్డిని.. రెస్టారెంట్ సిబ్బంది నిలువరించేందుకు ప్రయత్నించగా.. కత్తితో చుట్టుపక్కల అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో.. భానుకుమార్ రెడ్డిపై రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: సీఎం జగన్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు