ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ టీకా తీసుకున్న వైద్యురాలికి అస్వస్థత

ఒంగోలులో కొవిడ్ టీకా తీసుకున్న ఓ వైద్యురాలు అస్వస్థతకు గురైయ్యారు. ఆమె ఆరోగ్యంపై కలెక్టర్ పోలా భాస్కర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వైద్యులతో చర్చిస్తున్నారు.

corona vaccine
ఒంగోలులో వైద్యురాలికి అస్వస్థత

By

Published : Jan 28, 2021, 8:10 AM IST

కరోనా వ్యాక్సిన్​ తీసుకుని ఒంగోలులో ఓ వైద్యురాలు అస్వస్థతకు గురయ్యారు. స్థానిక రిమ్స్ లో తాత్కాలిక వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ ధనలక్ష్మి.. ఈ నెల 23న కొవిడ్​ టీకా వేయించుకున్నారు. మరుసటి రోజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బీపీ తగ్గడం, కడుపులో నొప్పి రావడం వంటి లక్షణాలతో ఒంగోలు రిమ్స్ లో చికిత్స చేయించుకున్నారు.

నిన్న పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే టీకా వల్ల ఆమె రియాక్షన్ కు గురయ్యారా అనే విషయం స్పష్టం కాలేదు. ధనలక్ష్మికి కొంతకాలంగా ఫోలిస్టైటిస్ వ్యాధి కారణంగా బ్లాడర్​లో రాళ్లు ఉన్నట్లు, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. కలక్టర్ పోలా భాస్కర్.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి.. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details