ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛనే ఆధారం.... రేషన్​ బియ్యంతోనే భోజనం! - కెల్లంపల్లి తాజా వార్తలు

ఓ ప్రమాదం ఆ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఇంటి పెద్ద నడుము విరిగి చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. అతని భార్య.. భర్తకు సేవ చేసుకుంటూ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. దీనివల్ల ఆదాయం వచ్చే మార్గం లేక కుటుంబ పోషణ భారమైంది. ప్రభుత్వ సాయం కోసం ఇప్పుడా కుటుంబం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కార్మికుడి కష్టాలు

By

Published : Nov 5, 2019, 7:31 AM IST

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కెల్లంపల్లికి చెందిన యాకోబు తాపీమేస్త్రీగా పనిచేస్తుండేవారు. 2014 సంవత్సరంలో ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి పడటంతో.. నడుము విరిగి నడవలేని స్థితికి చేరుకున్నారు. అప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. భర్త బాగోగులు చూసుకుంటూ యాకోబు భార్య ఇంట్లోనే ఉంటోంది.అతని చికిత్స కోసం చేసిన అప్పులు ఇప్పుడా కుటుంబానికి గుదిబండగా మారాయి. దీనికి తోడు నలుగురు పిల్లల పోషణ కష్టంగా మారింది. తమకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక భరోసా కల్పించాలని అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేదని యాకోబు వాపోయాడు.

2014 నుంచి ఎన్నోసార్లు కలెక్టరేట్​కు వచ్చి అధికారులకు తన కష్టాలు వివరించినా సాయం అందలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ రెండు సార్లు స్పందనలో కలెక్టర్​ని కలిసి తన సమస్య తెలిపానని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్​ ఏ మాత్రం సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కుటుంబమంతా రేషన్ బియ్యం తిని కాలం గడుపుతున్నామనీ.. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని యాకోబు కోరుతున్నారు.

కార్మికుడి కష్టాలు

ABOUT THE AUTHOR

...view details