ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆక్వా సమస్యలపై సదస్సు: ఆదుకోకపోతే క్రాప్‌ హాలిడేనే దిక్కు

Conference on Aqua issues in Ongole: సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తే క్రాప్‌ హాలిడేనే దిక్కని.. ఆక్వా రైతులు తేల్చిచెప్పారు. రైతులు బాగుంటేనే బయ్యర్లు, సీడ్‌, ఫీడ్‌ సంస్థలు మనుగడ సాగిస్తాయనే విషయం గుర్తుంచుకోవాలని స్పష్టంచేశారు. రొయ్యల కొనుగోలుకు బయ్యర్లు రకరకాల సాకులు చెబుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహించారు. అలాగే ధరలపై సీఎం ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని ఆవేదన చెందారు.

Aqua Farmers Conference
ఆక్వా సమస్యలపై సదస్సు

By

Published : Nov 26, 2022, 6:56 AM IST

Updated : Nov 26, 2022, 7:03 AM IST

Conference on Aqua issues in Ongole: ఆక్వా సమస్యలపై ఒంగోలులో నిర్వహించిన సదస్సుకు.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన రైతులు, కొనుగోలుదారులు, బయ్యర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు. ఇటీవల రొయ్యల ధరలు గణనీయంగా పడిపోవడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. వంద కౌంట్‌ కిలో కనీసం 170 నుంచి 180 రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదని వాపోయారు.

ఒకవైపు వైరస్‌తో సాగులో నష్టపోతుంటే.. ఎగుమతి మార్కెట్‌ లేదనే నెపంతో బయ్యర్లు లారీలు పెట్టడం లేదన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం, విద్యుత్‌ ఛార్జీలు పెరిగిపోవడం, నాణ్యమైన ఫీడ్‌, సీడ్ లభ్యం కాకపోవడం వల్ల... గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయామని ఆక్వా రైతులు చెప్పారు. ఇవే పరిస్థితులు కొనసాగితే సాగు కష్టమేనని రైతులు స్పష్టంచేశారు.

ఈ సదస్సుకు బీఎమ్​ఆర్ ఎగుమతి సంస్థ తరఫున హాజరైన వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు.. కొద్ది రోజుల్లోనే ఆక్వా రంగానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. రొయ్యలు ఉన్న వారి నుంచి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తామన్నారు. ఆక్వా రంగంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభిప్రాయాలు తప్పని చెప్పారు.

ఈ వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. నష్టాల్లో ఉన్న తమతోపాటు ఆక్వా రంగం గురించి మాట్లాడకుండా.. రాజకీయాలు ఎందుకని ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఆక్వా రైతుల్ని అన్నివిధాలా ఆదుకునేందుకు సీఎం జగన్‌ చిత్తశుద్ధితో ఉన్నారని.. ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్‌ ఛైర్మన్‌ రఘురాం హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రతి రైతుకూ అందేలా కృషి చేస్తామని చెప్పారు.

ఒంగోలులో ఆక్వా సమస్యలపై నిర్వహించిన సదస్సు

ఇవీ చదవండి:

Last Updated : Nov 26, 2022, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details