ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటిగుంటలో పడి బాలుడు మృతి - గుంటుపల్లి తాజా వార్తలు

ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం గుంటుపల్లిలోని ఓ నీటిగుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

A boy fell into a ditch in Guntupalli and died
గుంటుపల్లిలో నీటిగుంటలో పడి ఓ బాలుడు మృతి

By

Published : Sep 27, 2020, 11:25 PM IST

ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన మౌలాలి అనే బాలుడు నీటి గుంటలో పడి మృతి చెందాడు. తాత మీరాసాయబ్​తో కలిసి బాలుడు ... మేకలను మేపుకోవడానికి గ్రామ సమీపంలో ఉన్న అడవికి వెళ్లాడు.

తెల్లరాయి గుంటలో నీళ్లు తాగేందుకు మౌలాలి దిగి.. అందులో ప్రమాదవశాత్తు జారి గుంటలో పడి మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details