ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేరేడు పండ్ల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా - Apricot vehicle overturned

నేరేడు పండ్లతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పండ్లన్నీ నేలపాలయ్యాయి. ప్రకాశం జిల్లామార్టూరు మండలం ఇసుక దర్శి వద్ద ఈ ఘటన జరిగింది.

apricot nut vehicle overturned
నేరేడు కాయల వాహనం బోల్తా

By

Published : Jul 7, 2021, 1:59 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుక దర్శి వద్ద బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలోని నేరేడు పండ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా మారాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఈ వాహనం యాక్సల్ విరగటంతో అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టంది. ఈ క్రమంలో బొలెరో బోల్తా పడి.. కాయలన్నీ నేలపాలయ్యాయి. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా హైవే సిబ్బంది క్రమబద్దీకరించారు.

ABOUT THE AUTHOR

...view details