ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంటి చూపుతో పనేంటి... మంచి మనసుంటే చాలు..! - pandillapalli latest news

కరోనా విపత్కర సమయంలో తమకు వీలైనంత సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పలువురు. సాయం అడిగినా.. చేసేందుకు వెనుకాడే ప్రస్తుత పరిస్థితుల్లో ఓ అంధురాలు.. కొవిడ్​ బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. సోనూసూద్ ఫౌండేషన్​కు తన పెన్షన్​ను విరాళంగా అందించింది. ఎదుటి వారి కష్టాన్ని తీర్చేందుకు మంచి మనసుంటే చాలని చాటిచెప్పింది.

donation
సోనూసూద్​ పౌండేషన్​కు విరాళం

By

Published : May 18, 2021, 7:54 AM IST

కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా ఎంతో మందికి సేవలందిస్తున్న సోనూసూద్ ఫౌండేషన్​కు ఓ అంధురాలు తనకు వచ్చే పింఛన్​ మొత్తాన్ని విరాళంగా అందించింది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన శెట్టి నిహారిక (14).. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్​ సమక్షంలో ఐదు వేల రూపాయలను ఛారిటీ పౌండేషన్​కు ఇచ్చింది.

ఒకరి బాధ చూడటానికి కంటి చూపు అక్కర్లేదని.. మంచి పనికి ఉన్నత హృదయంతో చేసిన సాయం గొప్పదని జిల్లా ఎస్పీ అన్నారు. నిహారిక… తన వంతు ఆర్థిక సహాయం చేయటం గర్వించదగ్గ విషయమని.. ఎంతో మందికి స్పూర్తిదాయకమని ఎస్పీ ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details