ప్రకాశం జిల్లా ఒంగోలులో '90ఎమ్ఎల్' చిత్ర బృందం సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో కథానాయకుడు శివకార్తికేయ, హీరోయిన్ నేహా విద్యార్థులతో ఉత్సాహంగా గడిపారు. సినిమాలోని కొన్ని డైలాగ్లు చెప్పి ఉత్సాహపరిచారు. ఓ విద్యార్థితో కలిసి హీరో కార్తికేయ స్టెప్పులేశారు. ఒంగోలుకు రావటం తనకెంతో సంతోషంగా ఉందని కార్తికేయ పేర్కొన్నారు. డిసెంబర్ 5న విడుదల అయ్యే '90ఎమ్ఎల్' సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కార్తికేయ కోరారు. తన మెుదటి సినిమా 'ఆర్ఎక్స్100' కంటే పెద్ద హిట్ చేయాలని హీరోయిన్ నేహా కోరారు.
ఒంగోలులో '90ఎమ్ఎల్' చిత్ర బృందం సందడి - 90ml movie promotion in ongole
'90ఎమ్ఎల్' సినిమా బృందం ప్రకాశం జిల్లా ఒంగోలులో సందడి చేసింది. త్వరలో విడుదుల కానున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా... నటుడు కార్తికేయ, హీరోయిన్ నేహా... ఓ ప్రైవేటు కళాశాలలో సందడి చేశారు.
![ఒంగోలులో '90ఎమ్ఎల్' చిత్ర బృందం సందడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5157215-557-5157215-1574519296888.jpg)
ఒంగోలులో 90ఎమ్ఎల్ సినీ బృందం సందడి