ప్రకాశం జిల్లా కనిగిరిలో 9 నెలల బాలుడి అదృశ్యం కలకలం రేపింది. కనిగిరి నగర పంచాయతీలోని కాశిరెడ్డి కాలనీకి చెందిన జయంపు గణేష్, దుర్గలకు ఇద్దరు కుమారులు. గణేష్ బేల్దారి పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాడు. భార్య దుర్గ తన ఇద్దరు పిల్లలతో కలిసి కాశిరెడ్డి కాలనీలో నివాసం ఉంటోంది.
రోజూ మాదిరిగానే దుర్గ పక్కింటి ప్రేమలత మరి కొందరు మహిళలతో కలిసి ఇంటి సమీపంలో కాలక్షేపం కోసం గుండీలాట ఆడుకునే సమయంలో దుర్గ ఒడిలోనే తన కుమారుడు వంశీ (9 నెలలు) నిద్ర పోయాడు. దీంతో పక్కింటి ప్రేమలతకు తన కుమారుడినిచ్చి తన ఇంట్లో పడుకో పెట్టమని దుర్గ కోరింది. అందుకు సరే అన్న ప్రేమలత బాలుడిని తీసుకొని దుర్గ ఇంటి వైపు వెళ్లింది.