ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పీఎం గరీబ్ కల్యాణ్ కింద రూ. 50 లక్షల పరిహారం

By

Published : Jun 3, 2021, 9:10 PM IST

ప్రకాశం జిల్లాలో మార్చురీ వార్డు బాయ్‌గా విధులు నిర్వర్తిస్తూ.. కరోనాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి పీఎం గరీబ్ కల్యాణ్ కింద పరిహారం అందింది. దీనిని మంత్రి బాలినేని చేతుల మీదుగా అతని కుటుంబ సభ్యులు అందుకున్నారు.

compensation to front line worker family who died of corona
పీఎం గరీబ్ కల్యాణ్ కింద రూ. 50 లక్షల పరిహారం

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ కొవిడ్‌ కారణంగా మృతి చెందిన వ్యక్తికి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ యోజన కింద రూ. 50 లక్షలు పరిహారంగా కేంద్రం నుంచి అందింది. పరిహారాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఒంగోలు పట్టణంలో కిమ్స్ ఆసుపత్రిలో హనుమంతరావు అనే వ్యక్తి మార్చురీ వార్డు బాయ్‌గా విధులు నిర్వర్తించేవాడు. గత ఏడాది తొలి దశ కరోనా సమయంలో దశరాజుపల్లెకు చెందిన హనుమంతరావు కరోనా వైరస్‌ సోకి మృత్యువాత పడ్డాడు. ఫ్రంట్ లైన్ వర్కర్‌గా అతని పేరును ఆసుపత్రి వర్గాలతో పాటు జిల్లా అధికారులు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన బీమా పథకం కింద దరఖాస్తు చేశారు. దీనికి క్లైమ్ మంజూరవడంతో.. వారి కుటుంబ సభ్యుల ఖాతాలో నగదు జమయ్యింది.

ABOUT THE AUTHOR

...view details