అక్రమంగా నిల్వ ఉంచిన తెలంగాణ మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ వెంకటేశ్వర కాలనీలోని ఓ ఇంట్లో తెలంగాణా నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. 5 లక్షలు విలువ చేసే 370 మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలంగాణా నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఈ మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తించారు. సెబ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి, ఇన్స్‌పెక్టర్ తిరుపతయ్యల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏసీ పేర్కొన్నారు.
5 లక్షలు విలువైన తెలంగాణ మద్యం పట్టివేత - special enforcement bereau in prakasam dist news update
ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ వెంకటేశ్వర కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఐదు లక్షలు విలువచేసే మద్యాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
5లక్షలు విలువైన తెలంగాణ మద్యం పట్టివేత
TAGGED:
మద్యం పట్టివేత