ప్రకాశం జిల్లా చీరాలలో జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. 2 రోజులపాటు జరిగే ఈ పోటీలకు 78 టీములు పాల్గొంటాయని జిల్లాబ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అండర్ 13,15, 17,18 విభాగాల్లో స్త్రీ, పురుషులకు పోటీలతో పాటు, వెటర్నరీ విభాగంలో 30 నుండి 70 వయస్సు పైబడినవారికి కూడా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు అర్హత సాధిస్తారని అసోసియేషన్ ట్రెజరర్ కె.రమేష్ తెలిపారు.
ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన బ్యాడ్మింటన్ పోటీలు - ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేటలో ప్రారంభమైన 48వ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు.
ప్రకాశం జిల్లాలో ప్రారంభయిన బ్యాడ్మింటన్ పోటీలు