ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినీ ఫక్కీలో వెంటాడి.... భారీగా గంజాయి పట్టివేత - ప్రకాశం పోలీసులు వార్తలు

ప్రకాశం జిల్లా పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. సినీ ఫక్కీలో ఛేజ్​ చేసి... నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

400 kg of marijuana was seized in praksam district
భారీగా గంజాయి పట్టివేత

By

Published : Dec 20, 2019, 9:28 PM IST

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

తూర్పు గోదావరి జిల్లా నుంచి తమిళనాడుకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పుగుండూరు చెక్ పోస్టు వద్ద ఓ వాహనం దురుసుగా వెళ్లగా... దానిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆ లారీలో అక్రమంగా తరలిస్తున్న 400 కేజీల గంజాయిని గుర్తించారు. వాహనంతో పాటు ముందు ఎస్కార్ట్​గా వెళుతున్న కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వివరించారు. ఈ కేసులో నలుగురు తమిళనాడుకు చెందిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details