మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లోని 12 మండలాల్లో 40 గ్రామ పంచాయతీ సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 208 పంచాయతీలకు ఎన్నికల ప్రకటన జారీ చేశారు. అందులో 39 వాటిల్లో సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. గిద్దలూరు మండలం నరవలో సర్పంచి స్థానం ఏకగ్రీవం అవగా, వార్డులకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. మిగిలిన పంచాయతీలకు ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించనున్నారు.
అర్ధవీడు-1; బేస్తవారపేట-3; కంభం-2; పెద్దదోర్నాల-2; గిద్దలూరు-3; కొమరోలు-4; మార్కాపురం-8; పెద్దారవీడు-2; పుల్లలచెరువు-2; రాచర్ల-3; త్రిపురాంతకం-8; యర్రగొండపాలెం-2 పంచాయతీల్లో సర్పంచులతో పాటు, వార్డు సభ్యుల స్థానాలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి.