ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెస్తవారిపేటలో పిచ్చికుక్క బీభత్సం.. 25 మందికి గాయాలు - Picchikukka Swaira Viharam in Bestavaripeta

ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. పిచ్చి కుక్క దాడిలో 25 మంది గాయపడ్డారు. బాధితులను మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పిచ్చికుక్క స్వైర విహారం
పిచ్చికుక్క స్వైర విహారం

By

Published : Aug 30, 2021, 3:50 PM IST

ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. స్థానిక ఎంపీపీ కార్యాలయం వద్ద ఆ మార్గంలో వచ్చిపోయేవాళ్లపై విరుచుకుపడింది. దొరికిన ప్రతి ఒకరిపై దాడి చేసింది. శునకం దాడిలో 25 మంది వరకు గాయపడ్డారు. వాళ్లలో పిల్లలు, పెద్దలు ఉన్నారు. బాధితులను మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కుక్క దాడిలో 10 మందికి తీవ్రగాయాలు కాగా.. సాలమ్మ అనే మహిళ వేలు తెగిపోయింది. పలువురికి వివిధ శరీర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామస్థులు.. పిచ్చికుక్కను కర్రలతో కోట్టి చంపారు. బెస్తవారిపేటలో కుక్కల బెడద ఇటీవల ఎక్కువైందని స్థానికులు వాపోయారు. కుక్కల నివారణకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details