ప్రభుత్వ మద్యం దుకాణాలకు నిర్దేశ సమయాల్లో మూసివేస్తుండటంతో... అక్రమార్కులకు అది వరంగా మారింది. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం సమీపంలో నిత్యం ఉదయం నుంచే మద్యం విక్రయాలు యథేచ్చగా జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మద్యం అమ్ముతున్న సాధు ఈశ్వరరావును అరెస్ట్ చేశారు. అతని నుంచి 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే మద్యం సేవిస్తున్న వారిని పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వ దుకాణంలో మద్యం కొనుగోలు చేసుకుని షాపు మూసి వేసిన తర్వాత సాధు ఈశ్వరరావు మద్యం విక్రయిస్తున్నాడని ఎస్ఐ నరసింహరావు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వెల్లడించారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ - 25 liquor bottles seized news in prakasam district
ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం సమీపంలో మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
25 liquor bottles seized in prakasam district