ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని హరిప్రసాద్ రైల్వే గేటు కూడలిలో అనధికారంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. మద్యం అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని 239 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చీరాల ప్రాంతంలో అనధికారకంగా మద్యం అమ్మకాలు జరిగితే ఉపేక్షించేది లేదని సి.ఐ నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు.
అనధికారంగా మద్యం విక్రయం.. 239 సీసాలు స్వాధీనం - ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా చీరాలలో మద్యం గొలుసు దుకాణాలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. చీరాల పట్టణంలోని హరిప్రసాద్ రైల్వే గేటు కూడలిలో అనధికారంగా ఉన్న 239 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చీరాల్లో 239 మద్యం సీసాలు స్వాధీనం