ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్తీ ఆహారం తిని...20 మంది ఆస్వస్థత - ప్రకాశం జిల్లా నేర వార్తలు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ హోటల్‌లో భోజనం చేసిన పలువురు ఆస్వస్థతకు గురయ్యారు. జ్వరం, తలనొప్పి, వాంతులు రావడంతో ఆసుపత్రుల్లో చేరారు... అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ చేపట్టారు. అహార నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు.

కల్తీ ఆహరం తిని అస్వస్థతకు గురైన యువతి
కల్తీ ఆహరం తిని అస్వస్థతకు గురైన యువతి

By

Published : Dec 8, 2020, 1:23 AM IST

Updated : Dec 8, 2020, 6:41 AM IST

కుటుంబంతో సరదాగా హోటల్‌కు వెళ్లి భోజనం చేసిన వారు అస్వస్థతకు గురైన ఘటన... ప్రకాశం జిల్లా ఒంగోలులో కలకలం రేపింది. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని హోటల్‌ బార్కాస్‌లో ఆదివారం రాత్రి మండీ బిరియాని, చికెన్‌, చేపలు తిన్న వారు... జ్వరం, వాంతులు, తలనొప్పి లాంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అదే హోటల్‌లో భోంచేసిన సుమారు 20 మంది వరకూ ఈ విధంగా అనారోగ్యం బారిన పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సంబంధిత అధికారులు ఆహారం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. కల్తీ లక్షణాలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Last Updated : Dec 8, 2020, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details