ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేర్నమెట్టలో పిడుగుపాటు..ఇద్దరు కూలీలు మృతి - 2 people died of thunder bolt

ప్రకాశం జిల్లా పేర్నమెట్టలో పిడుగుపాటుకు పొలంలో ఉన్న ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు.

పేర్నమెట్టలో పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు మృతి

By

Published : Oct 7, 2019, 10:33 PM IST

పేర్నమెట్టలో పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు మృతి

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమెట్టలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు పొలాల్లోని ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మిరప నాట్లు వేసేందుకు పొలాల్లో కూలీలుగా ఉన్నారు. హఠాత్తుగా పడ్డ పిడుగులకు భయంతో కొంతమంది కూలీలు చెట్ల చాటుకు వెళ్లారు. అది కాస్త నేరుగా చెట్టు మీదే పడటంతో అక్కడే ఉన్న కోటేశ్వరమ్మ, శేషమ్మలు మృతి చెందారు. అప్పటివరకూ కలివిడిగా తిరిగి..పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందటంఅందరినీ కలచివేసింది.

ABOUT THE AUTHOR

...view details