ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద జరిపిన వాహన తనిఖీల్లో భారీగా నగదు లభ్యమైంది. నర్సాపురం నుంచి కావలికి కారులో తరలిస్తున్న కోటి రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
డబ్బు.. నర్సాపురానికి చెందిన జయదేవ్ జ్యువలరీస్దిగా గుర్తించారు. బంగారం కొనుగోలుకు నగదు తరలిస్తున్నట్లు తనిఖీల్లో పట్టుబడ్డ జ్యువలరీస్ సిబ్బంది తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసిన అధికారులు.. డబ్బును ఆదాయపన్ను శాఖకు అప్పగించారు.