ఆర్టీసీ బస్సు ఢీ కొని బాలుడు మృతి - latest crime news in prakasam
ప్రకాశం జిల్లా మార్టూరులో ఆర్టీసీ బస్సు కింద పడి వేణు అనే బాలుడు మృతి చెందాడు. ఒంగోలు నుంచి విజయవాడ వస్తున్న బస్సు సైకిల్‌పై వెళుతున్న బాలుణ్ని ఢీ కొట్టింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.