ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో నాటుసారా తయారీ కేంద్రాలు వెలిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. వెంకటాపురం తండాలో నాటుసారాకు వినియోగించే 1500 లీటర్ల బెల్లం ఊటను సబ్ ఇన్స్పెక్టర్ సమందర్ వలి, సిబ్బంది ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గిద్దలూరులో 1500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - సబ్ ఇన్స్పెక్టర్ సమందర్ వలి
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించటంతో మద్యపానానికి డిమాండ్ ఏర్పడింది. గిద్దలూరులో నాటుసారా తయారీ కేంద్రాలు పెద్ద ఎత్తున ఊపందుకున్నాయి. నాటు సారా కేంద్రాలపై పోలీసులు దాడులు చేసి.. 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు
1500 లీటర్ల బెల్లం ఊటల సామాగ్రి ధ్వంసం
TAGGED:
BELLAM OOTA DWAMSAM