ప్రకాశం జిల్లాలో సోమవారం 1236 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 10,093 నమూనాలను పరీక్షించగా అత్యధికంగా ఒంగోలులో 104, పర్చూరులో 88, సంతమాగులూరులో 60 కేసులు వెలుగుచూశాయి. సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో వినుకొండ, ఈదుమూడి, మద్దిపాడు, అంబాపురం, కొప్పోలు, పొందూరు గ్రామాలకు చెందిన వారు ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో కొవిడ్ మృతుల సంఖ్య 649కి చేరింది.
ప్రస్తుతం 9073 మంది వ్యాధితో కొనసాగుతున్నారు. 1896 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మిగిలినవారు గృహ ఏకాంతంలో ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 64 మంది ఆసుపత్రుల్లో చేరగా, 375 మంది డిశ్ఛార్జి అయ్యారు. మొత్తం 32 కొవిడ్ ఆసుపత్రులుండగా.. విజిలెన్స్ తనిఖీల్లో లోపాలు వెలుగులోకి రావడంతో ఒంగోలులో రెండు, కందుకూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిని డీనోటిఫై చేశారు. కొత్తగా నగరంలో ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అనుమతిచ్చారు.