ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాల బస్సు బోల్తా... విద్యార్థులకు స్వల్ప గాయాలు - bus accidents

ప్రకాశం జిల్లా చింతలపాలెంలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడిన ఘటనలో 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై మంత్రి పేర్ని నాని పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. నిబంధనలు పాటించకుంటే స్కూలు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బస్సు ప్రమాదం

By

Published : Sep 19, 2019, 12:39 PM IST

పాఠశాల బస్సు బోల్తా... విద్యార్థులకు స్వల్ప గాయాలు

ప్రకాశం జిల్లా దర్శి మండలం చింతలపాలెం సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు టైరు పగిలి బోల్తా పడింది. ఈ ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది విద్యార్థులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి సమీప తరలించారు.

మంత్రి ఆగ్రహం

బస్సు బోల్తా పడిన ఘటనపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల పరిస్థితిపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల బస్సులకు ఫిట్​నెస్​ లేకున్నా... నిబంధనలు పాటించకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

ఇదీ చూడండి : సివిల్‌ వివాదంలో ఎస్సై జోక్యం... ముగ్గురు రైతుల ఆత్మహత్యాయత్నం...

ABOUT THE AUTHOR

...view details