యండ్రపల్లిలో 10 లీటర్ల నాటుసారా ధ్వంసం - 10 liters of Natusara destroyed
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం యండ్రపల్లిలో నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 10 లీటర్ల సారాను ధ్వంసం చేశారు.
యండ్రపల్లిలో 10లీటర్ల నాటుసారా ధ్వంసం
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం యండ్రపల్లిలో మలుపు వద్ద నాటుసారా తరలిస్తున్నారని మందుస్తు వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు. ముడావత్ బాల కృష్ణ నాయక్ అనే వ్యక్తి నాటు సారాయిని ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 10లీటర్ల సారా, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.