ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి లోక్​సభ వైకాపాదే : అఖిల భారత గంగపుత్ర మహసభ - tirupathi By Polls Latest News

నెల్లూరు జిల్లాలో తిరుపతి లోక్​సభ ఉపఎన్నికకు ప్రచారం నిమిత్తం వచ్చిన మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు రెండు రోజులు పర్యటించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైకాపా అభ్యర్థి గురుమార్తి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రిని అఖిల భారత గంగపుత్ర మహాసభ ప్రతినిధులు కలిశారు.

తిరుపతి లోక్​సభ వైకాపాదే : అఖిల భారత గంగపుత్ర మహసభ
తిరుపతి లోక్​సభ వైకాపాదే : అఖిల భారత గంగపుత్ర మహసభ

By

Published : Apr 14, 2021, 12:05 AM IST

తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల ప్రచారానికి నెల్లూరు విచ్చేసిన మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పల రాజును అఖిల భారత గంగపుత్ర మహాసభ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్గంగా మంత్రితో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం సాయంత్రం నెల్లూరు పట్టణంలోని హోటల్ మినర్వాలో మంత్రిని మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు బెస్త సత్కరించారు.

'వారికే మద్దతు'

తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా జన ప్రభంజనం సృష్టిస్తుందని వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మత్స్యకారుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేసి, గంగపుత్రులకు అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నట్లు తెలిపారు. గంగపుత్రులను ఆదుకునే వారికి తామ మద్దతు తప్పక ఉంటుందని ఆయన వివరించారు. రెండు రోజుల పర్యటన ముగించుకున్న మంత్రి అప్పలరాజు.. రైలు మార్గాన శ్రీకాకుళం జిల్లా పలాసకు చేరుకున్నారు. కార్యక్రమంలో గంగపుత్ర మహాసభ నాయకులు, వైకాపా శ్రేణులు పాల్గొన్నాయి.

ఇవీ చూడండి : ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణలో మరో ముందడుగు

ABOUT THE AUTHOR

...view details