YSRCP Leaders Stop Sand Mining : ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలిచ్చినా నెల్లూరులో అక్రమ ఇసుక రవాణా ఆగడం లేదు. డూరుపాడు మీదుగా భారీ లోడుతో టిప్పర్లు రాకపోకలు సాగించడంతో రోడ్లు ధ్వంసం అయ్యాయని గ్రామస్థులు అధికార పార్టీ నాయకులను నిలదీశారు. ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో స్వయంగా వైఎస్సార్సీపీ నాయకులే రీచ్ నుంచి వస్తున్న ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఇసుక లారీలు ఎక్కువ బరువు ఇసుకను తీసుకుపోవడం వల్ల రోడ్డు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టే వరకు లారీలను విడిచి పెట్టే ప్రసక్తే లేదని వారు భీష్మించారు.
అధిక లోడుతో ఇసుక తరలిస్తున్న వాహనాల అడ్డగింత - రోడ్లు మరమ్మతు చేయాలని గ్రామస్థుల డిమాండ్ Sand Smuggling in Nellore : నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో నాలుగేళ్లుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. పల్లెపాడు-కోడూరుపాడు గ్రామీణ ప్రాంతాల మధ్య నిత్యం భారీ లోడుతో వందల లారీలు ఇసుకను తరలించేవి. దీంతో ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు గోతులమయంగా మారింది. ఇసుక రవాణా ఆపాలని, రోడ్లు దెబ్బతింటున్నాయని గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్థులు ఆందోళనలు చేసినప్పటికీ రాకపోకలు ఆగలేదు. దీంతో ఆగ్రహించిన స్థానికులు తమ దయనీయస్థితిని అధికార పార్టీ నేతలకు విన్నవించారు. లారీల రాకపోకలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను వైఎస్సార్సీపీ నాయకులే అడ్డుకున్నారు.
కాలపరిమితి పూర్తైన బిల్లులతో అక్రమంగా ఇసుక తరలింపు-మాజీ ఎమ్మెల్యే
Illegal Sand Mining in Nellore District :జిల్లాలో ఇసుక తరలింపునకు అధికారులు అనుమతులు ఇవ్వలేదు. ఐనప్పటికీ నవీన్ రెడ్డి అనే గుత్తేదారు కొద్దిరోజులుగా పల్లెపాడు రీచ్ నుంచి ఇసుకను తరలిస్తున్నాడు. ఎన్నిసార్లు హెచ్చరించిన రవాణా ఆపకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు, స్థానికులు లారీలను అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా నిల్చొని నిరసన తెలిపారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర లారీలు, టిప్పర్లు నిలిచిపోయాయి. అక్కడికొచ్చిన ఇసుక రీచ్ నిర్వహకులకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. దెబ్బతిన్న రోడ్డును బాగు చేసే వరకు రీచ్ నుంచి ఒక్క వాహనాన్ని బయటకు వెళ్లనీయమని హెచ్చరించారు.
Illegal Sand Mining: నిబంధనలు బేఖాతరు.. వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు
రోడ్ల మరమ్మతులు చేసి బండ్లు తీసుకెళ్లండి : "ఇసుక తరలించడం ద్వారా రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఈ రహదారులపై వాహనదారులు వెళ్లాలంటే భయపడుతున్నారు. స్థానిక ప్రజలు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే నానా అవస్థలు పడుతున్నారు. ఎవరు ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. రోడ్లు బాగు చేయండని విన్నివించుకున్నాం. వారు ససేమిరా అన్నారు. అందుకే అందరం కలిసి ఇసుక తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నాం. రోడ్లు బాగు చేసినప్పుడే వాహనాలను విడిచి పెడతాం."- పరమేశ్వరరెడ్డి, కోడూరుపాడు మాజీ సర్పంచ్
Sand Mining: వైఎస్సార్సీపీ నేత చేతుల్లో ఇసుక దందా.. తెరపై మాత్రం మరో వ్యక్తి..