ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో తాజా, మాజీ మంత్రుల సభ.. రంగంలోకి దిగిన అధిష్టానం - ap news

ysrcp focus on Kakani, Anil: నెల్లూరులో టెన్షన్​ వాతావరణానికి తెర దించేందుకు అధిష్టానం రంంలోకి దిగింది. మంత్రి కాకాణి, మాజీ మంత్రి సభల నేపథ్యంలో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరువురు నేతలు సభలు నిర్వహించుకున్నా... పరస్పర విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ఈరోజు ఇరువురు నేతల వేర్వేరు సభల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

ysrcp logo
ysrcp logo

By

Published : Apr 17, 2022, 12:41 PM IST

Updated : Apr 17, 2022, 12:53 PM IST

నెల్లూరు వైకాపా రాజకీయలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. తాజా మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ మద్య జరగుతున్న పరిణామాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరు నేతలు నేడు నిర్వహించనున్న కార్యక్రమాలపై ఆరా తీసిన అధిష్టానం,.. ఎవరి కార్యక్రమాలు వారు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో పరస్పర విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవద్దని ఆదేశించింది.

వేర్వేరుగా ఇరు నేతల సభలు: ఇవాళ అందరి దృష్టీ నెల్లూరు రాజకీయాలపైనే పడనుంది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఒకేరోజు వేర్వేరు సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ నగరానికి రానున్న కాకాణికి.. కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. అదే సమయంలో అనిల్ కూడా.. నగరంలోనే మరో సభ నిర్వహించనున్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాకాణి ఎలా సహకరించారో.. అనిల్ అంతకు డబుల్ ఇస్తాననడం గుర్తు తెలియని వ్యక్తులు కాకాణి ఫ్లెక్సీలు తొలగించడంతో పరిస్థితి వేడెక్కింది.

రెండింతలు ఇస్తానన్న అనిల్ : వీరి విభేదాల చర్చ.. మూడు రోజుల నుంచి ఎక్కువైంది. మంత్రి కాకాణికి సహకారం అందిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అనిల్‌ తనదైన శైలిలో స్పందించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కాకాణి తనను ఆహ్వానించలేదని చెప్పారు. పిలవకుండా తాను ఎందుకు వెళ్లాలి? అని ప్రశ్నించారు. ఆంతేకాకుండా.. వ్యంగ్య బాణాలూ విసిరారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి ఎలాంటి సహకారం అందించారో.. తనపై ఎలాంటి ప్రేమ చూపారో.. కచ్చితంగా అదే ప్రేమ, సహకారం రెండింతలు అందిస్తానని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. దీంతో.. నెల్లూరు వైకాపాలో గ్రూపు రాజకీయాలు రంజుగా మారబోతున్నాయనే చర్చ అప్పుడే మొదలైంది.

కాకాణి ఫ్లెక్సీ తొలగింపు: వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. తొలిసారిగా కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాకు వస్తున్నారు. ఈరోజు మంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో.. అక్కడి మంత్రి అనుయాయులు భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా.. కావలి నుంచి నెల్లూరు నగరం వరకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట హరనాథ్ పురం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో.. వైకాపాలో దుమారం చెలరేగింది. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ ఎదురుగా వంతెనపై కాకానికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీని భారీస్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని జాతీయ రహదారుల అధికారులు క్రేన్​తో తొలగించారు. అనంతరం పక్కనే ఉన్న కాలువగట్టుపై ఆ ఫ్లెక్సీని పడేశారు. దీంతో.. మరో వివాదానికి అవకాశం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పోలీసుల భారీ బందోబస్తు: మంత్రి కాకాణి ర్యాలీ, మాజీమంత్రి అనిల్‌ సభ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి కాకాణి కోవూరు నుంచి నెల్లూరు బయల్దేరనున్నారు. పడుగుపాడు, ఆత్మకూరు బస్టాండ్‌, బైపాస్‌ రోడ్డు మీదుగా బైక్‌ ర్యాలీ కొనసాగనుంది. కోవూరు నుంచి నెల్లూరులోని వైకాపా కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహిస్తారు. మరోవైపు సాయంత్రం 5గంటలకు నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్‌లో మాజీ మంత్రి అనిల్‌ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి: నెల్లూరులో టెన్షన్​ వాతావరణం.. ఈరోజు మంత్రి, మాజీ మంత్రి వేర్వేరు సభలు

Last Updated : Apr 17, 2022, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details