YSRCP EX MINISTER ANIL COMMENTS: నెల్లూరు జిల్లా సొంతపార్టీ నేతలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి విమర్శలు గుప్పించారు. నెల్లూరులో.. గడగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వైకాపాలో ఉంటూ ఒక నాయకుడు సిగ్గుమాలిన పనులు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. వైకాపాలో కొందరు నేతలు తెలుగుదేశం వారితో నిత్యం మాట్లాడుతూ.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చి నన్ను తిట్టించే స్థాయికి దిగజారారని.. వాళ్ల చిట్టా మొత్తం తన వద్ద ఉందన్నారు.
సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి అనిల్ విమర్శలు, తెదేపా నేతలతో మంతనాలంటూ వ్యాఖ్య - ఏపీ తాజా వార్తలు
EX MINISTER ANIL సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు పార్టీలో ఉండి తెదేపా నేతలతో మంతనాలు జరుపుతూ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరి ఫోన్ కాల్ హిస్టరీ తన వద్ద ఉందని తెలిపారు.
EX MINISTER ANIL