ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా విక్రమ్‌: రాజమోహన్‌ రెడ్డి - mekapati vikram reddy news

మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా తన రెండో అబ్బాయి విక్రమ్ రెడ్డిని నిర్ణయించినట్లు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తన కుమారుడు విక్రమ్ రెడ్డితో కలిసి తాడేపల్లికి వచ్చిన రాజమోహన్ రెడ్డి.. సీఎం జగన్​తో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి వెళ్లేముందు సీఎం జగన్ ఆశీస్సులు తీసుకోవడానికి విక్రమ్​ని తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా విక్రమ్‌
మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా విక్రమ్‌

By

Published : Apr 28, 2022, 8:51 PM IST

మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని నిలపాలని వైకాపా నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మేరకు తన కుమారుడు విక్రమ్ రెడ్డితో కలిసి తాడేపల్లికి వచ్చిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.. సీఎం జగన్​తో సమావేశమయ్యారు. గౌతమ్ రెడ్డి వారసుడిగా తన రెండో అబ్బాయి విక్రమ్ రెడ్డిని నిర్ణయించినట్లు రాజమోహన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి వెళ్లేముందు సీఎం జగన్ ఆశీస్సులు తీసుకోవడానికి విక్రమ్​ని తీసుకువచ్చినట్లు తెలిపారు. తన అన్నయ్య వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్నానన్నవిక్రమ్..., అన్నయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. నియోజకవర్గానికి అన్నయ్య చేయాలనుకున్నదాన్ని తాను చేసి చూపిస్తానన్నారు.

ABOUT THE AUTHOR

...view details