నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాదరావు వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని వెలికల్లు గ్రామంలో 11 లక్షల రూపాయలతో తాగునీటి పథకం పునరుద్ధరణ నిర్మాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
నెల్లూరులో ఘనంగా వైఎస్సార్ జయంతి - MLA Anam Ramanarayana Reddy
నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు పాల్గొన్నారు.
నెల్లూరు వైఎస్ జయంతి
గ్రామాల్లో ఇతర కనీస సదుపాయాలపై సచివాలయ ఉద్యోగులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ప్రజలకు సక్రమంగా చేరేలా బాధ్యత వహించాలని నేతలు సూచించారు. అటవీ సమస్యల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని పలు ఊర్లకు రహదారి నిర్మాణాలు కాలేదని... అడ్డంకులను ఎంపీతో కలిసి పరిష్కరించటానికి చర్యలు తీసుకుంటామని ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జయంతి రోజున పేదలకు తాగునీటి సదుపాయాన్ని కల్పించటం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి భద్రత లేదంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన