పెద్దలకు ఆరోగ్యకరమైన, అహ్లాదకరమైన జీవితాన్ని అందించాల్సిన బాధ్యత యువతపై ఉందని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దల పట్ల యువత గౌరవం, ఆప్యాయతతో మెలగాలని సూచించారు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది వృద్ధుల దినోత్సవ కార్యక్రమం రద్దు చేశామని తెలిపారు. వృద్ధులు ఇంట్లోనే ఉంటూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే పెద్దవారి నుంచి నేటి యువత నేర్చుకోవలసినవి అనేకం ఉన్నాయని కలెక్టర్ చెప్పారు.
వయోజనుల పట్ల యువత గౌరవంతో మెలగాలి: కలెక్టర్ చక్రధర్ బాబు - nellore district latest news
పెద్దల పట్ల యువత గౌరవం, ఆప్యాయతతో మెలగాలని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు. వారు ఆనందంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
![వయోజనుల పట్ల యువత గౌరవంతో మెలగాలి: కలెక్టర్ చక్రధర్ బాబు nellore district collector chakradhar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8998696-739-8998696-1601486598563.jpg)
nellore district collector chakradhar