నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచిలో యశ్వంత్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలోని అల్లూరుపేట ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులతో కలసి సరదాగా వెళ్లిన యశ్వంత్... బావిలో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నలుగురు స్నేహితులు సాయంత్రం మల్లితోటలో ఉన్నారని, ఆ తర్వాత బావి వద్ద కనిపించారని స్థానికులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి - suspected deaths news in nellore
తన స్నేహితులతో కలసి సరదాగా బయటకు వెళ్లిన ఓ యువకుడు...అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా అల్లూరుపేటలో జరిగింది.
youth-died-in-suspicious-condition-at-aallurupeta-in-nellore