నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ యువతికి సమీప బంధువుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరు మనుమసిద్ధి నగర్లో ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. ఈ కారణంతో కొంతకాలంగా అత్తింటి వేధింపులు మెుదలయ్యాయి. ఇదే క్రమంలో ఆమె సమీప బంధువులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెకు కూడా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలడంతో అత్తింటి వారి నిరాదరణకు గురైంది.
అత్తింటి వేధింపులు..ఆపై కరోనా..మనస్తాపంతో యువతి ఆత్మహత్య - crime news nellore
పిల్లలు పుట్టలేదని..అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వేధింపులు ఒకవైపు.. మరోవైపు కరోనా సోకటంతో నిరాదరణకు గురైన ఓ యువతి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
శనివారం భర్త, కుటుంబ సభ్యులు కావలి వెళ్లగా.. అ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి మనస్తాపంతో పురుగుల మందు తాగింది. కావలి వెళ్లిన మృతురాలి భర్త పలుమార్లు ఆమెకు ఫోన్ చేసినా ఎత్తకపోవటంతో హుటాహుటిన నెల్లూరుకు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఆమె మృతి చెందింది. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.