ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో యువకుడు హల్​చల్... ఎన్నికల అధికారులపై దాడికి యత్నం - young men unlawful behaviour in pamidipadu news

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పమిడిపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో హల్ చల్ చేశాడు. విధినిర్వహణలో ఎన్నికల ఇబ్బంది, పోలీస్ సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు. బంధువులు వస్తున్నారు.. పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ అధికారులను ఒత్తిడికి గురి చేశాడు.

police station
పమిడిపాడు పోలింగ్ కేంద్రం వద్ద యువకుడు హల్​చల్

By

Published : Apr 10, 2021, 7:45 AM IST

నెల్లూరు జిల్లా పమిడిపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద వంశీకృష్ణ అనే యువకుడు మద్యం మత్తులో వీరంగ సృష్టించాడు. తమ బంధువులు వస్తున్నారు పోలింగ్ సమయాన్ని పొడిగించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అధికారులు అందుకు ఒప్పుకోని కారణంగా దాడికి ప్రయత్నించాడు.

అక్కడే ఉన్న ఆత్మకూరు స్టేషన్ ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి ఆ యువకుడ్ని వారించే ప్రయత్నం చేశారు. వంశీకృష్ణ.. పోలీస్ సిబ్బందిపైనా తిట్లు అందుకున్నాడు. ఈ క్రమంలో చిన్నపాటి ఘర్షణ వాతవరణం నెలకొంది. విధులకు ఆటంకం కలిగించిన వంశీకృష్ణపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details