నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలకలోని అమరా గార్డెన్లో నివాసం ఉంటున్న ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. తర్వాత కుటుంబ సభ్యులు చూసి బయటకు తీశారు.
ప్రేమ విఫలమై బాలిక ఆత్మహత్య - నాయుడుపేటలో బాలిక ఆత్మహత్య
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ విఫలమే అందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
బాలిక ఆత్మహత్య
ప్రేమ విఫలమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఆమెకు కొన్ని నెలల క్రితం అనంతపురానికి చెందిన యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. అతనితో కలసి వెళ్లి పోయింది.. తర్వాత అతడిని వదిలేసి తిరిగి ఇంటికి వచ్చిందని తెలుస్తోంది.
ఇదీ చదవండి:ఆత్మకూరులో వైఎస్ఆర్ విగ్రహం కుడి చేయి ధ్వంసం