ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొంత పార్టీ నేత వసూళ్ల దందాను బయటపెట్టిన వైకాపా ఎమ్మెల్యే! - వైకాపా నేత అవినీతిని బయటపెట్టి వైకాపా ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. విడవలూరు మండలంలో ఓ వైకాపా నేత వసూళ్ల దందాను స్వయంగా బయటపెట్టారు. ప్రభుత్వ భూములకు పట్టాలిప్పిస్తానంటూ తన పేరు చెప్పి.. డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. సదరు వ్యక్తిని ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కనీయొద్దని..అధికారులకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

సొంత పార్టీ నేత వసూళ్ల దందాను బయటపెట్టిన వైకాపా ఎమ్మెల్యే !
సొంత పార్టీ నేత వసూళ్ల దందాను బయటపెట్టిన వైకాపా ఎమ్మెల్యే !

By

Published : Feb 26, 2022, 4:17 PM IST

సొంత పార్టీ నేత వసూళ్ల దందాను బయటపెట్టిన వైకాపా ఎమ్మెల్యే !

నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో ఓ వైకాపా నేత వసూళ్ల దందాను.. స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే బయటపెట్టారు. పొన్నపూడి గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. స్థానిక వైకాపా నేత తీరుపై (పేరు వెల్లడించలేదు) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు చెప్పి.. డబ్బులు వసూళ్లు చేయమేంటని ధ్వజమెత్తారు.

సదరు వ్యక్తిని ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కనీయొద్దని.. అధికారులకు స్పష్టం చేశారు. ఇకనైనా ఆ వ్యక్తి తీరు మార్చుకోకపోతే.. పార్టీ నుంచి బహిష్కరిస్తామని ప్రసన్నకుమార్‌రెడ్డి హెచ్చరించారు.

భూములకు పట్టాలంటూ నా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. విడవలూరు మండలంలో వసూళ్లు సాగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు, రైతుల వద్ద రూ.లక్షలు వసూలు చేశారు. చాలాసార్లు మందలించినా తీరు మార్చుకోలేదు. నాకు, పార్టీకి చెడ్డపేరు తెస్తే క్షమించను. తీరు మార్చుకోకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తాం.-నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే

ఎమ్మెల్యే పరోక్షంగా వైకాపా నేతను హెచ్చరించడంతో.. ఆ వ్యక్తి ఎవరై ఉంటారా? అని స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తల్లో చర్చ మెుదలైంది.

ఇదీ చదవండి

Russia Ukraine War: 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశాం: కృష్ణబాబు

ABOUT THE AUTHOR

...view details