ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజకీయంగా విమర్శిస్తే స్వాగతిస్తా.. వ్యక్తిగతంగా విమర్శిస్తే స్పందిస్తా..?'

MLA KOTAM REDDY FIRE ON YCP LEADERS: ''నాపై రాజకీయంగా విమర్శిస్తే స్వాగతిస్తా.. ఆధారాలతో వ్యక్తిగతంగా విమర్శిస్తే స్పందిస్తా.. కానీ, అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం అదే పంథాలో తిరగబడుతా'' అని నెల్లూరు గ్రామీణ వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. నెల్లూరులోని స్థలం వివాదంలో తన సోదరుడు గిరిధర్‌ రెడ్డిని కావాలనే ఇరికించారని పేర్కొన్నారు. ఆ స్థలం వివాదానికి సంబంధించి కోటంరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలను వెల్లడించారు.

land purchase issue
land purchase issue

By

Published : Feb 27, 2023, 4:06 PM IST

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

MLA KOTAM REDDY FIRE ON YCP LEADERS: నెల్లూరులోని స్థలం వివాదంలో తన సోదరుడు గిరిధర్‌ రెడ్డిని కావాలనే ఇరికించారని.. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆరోపించారు. న్యాయం కోసం వచ్చిన వారి నుంచి వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆయన సోదరుడు గిరిధర్‌ రెడ్డిలు బలవంతంగా భూమిని రాయించుకున్నారంటూ.. సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న సంఘటనపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి తీవ్రంగా ఆగ్రహించారు. స్థలం వివాదానికి సంబంధించి ఈరోజు కోటంరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, పలు కీలక విషయాలను వెల్లడించారు.

సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నవారు.. వాటిని మానుకోవాలని కోటంరెడ్డి హెచ్చరించారు. వేమిరెడ్డి చెబితేనే.. డాక్టర్ రాధామాధవి విషయంలో జోక్యం చేసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. భూ తగదాలు తమ కార్యాలయానికి అలవాటు లేవని.. రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా అబద్దాలను నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

డాక్టర్ రాధా మాధవి భూమి కొనుగోలు విషయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి చెబితేనే జోక్యం చేసుకున్నామన్నారు. మేలు చేద్దామనుకుంటే తమకే కీడు ఎదురైందని తెలిపారు. డాక్టర్ రాధా మాధవి భూమి కొనుగోలు విషయంలో తాను చెప్పడం వల్లే తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి జోక్యం చేసుకున్నాడని వివరించారు. రూ. 4 కోట్ల 70 లక్షలు రూపాయలు చెల్లించిన రాధామాధవి వద్ద కాగితం ముక్క ఆధారం లేకపోయినా, సహాయం చేసేందుకు తాము పూనుకున్నామన్నారు. తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి జోక్యంతోనే శ్రీనివాసులు నాయుడు రూ. 4 కోట్ల 70 లక్షలు చెల్లించేందుకు ఒప్పంద పత్రం రాసిచ్చిన విషయాన్ని మీడియా ముందు కోటంరెడ్డి వెల్లడించారు.

ఈ వివాదం విషయంలో ఇప్పటికైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డిలు స్పందిస్తే మంచిదని కోటంరెడ్డి అభ్యర్థించారు. వి.పి.ఆర్. చెప్పారని డాక్టర్ రాధామాధవి విషయంలో తాను, తన సోదరుడు జోక్యం చేసుకున్నాము గనుక వాళ్లద్దరూ త్వరగా స్పందించి ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరారు. అనంతరం తనపై రాజకీయంగా విమర్శిస్తే స్వాగతిస్తానని.. ఆధారాలతో వ్యక్తిగత విమర్శలు చేస్తే స్పందిస్తానని.. అసత్య ఆరోపణలు చేస్తే, అదే పంథాలో తిరగబడుతానని కోటంరెడ్డి శ్రీధర్ హెచ్చరించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details