ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్టు ఓ బూటకం: వర్ల - వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్టు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టు బూటకమని తెదేపా నాయకుడు వర్ల రామయ్య విమర్శించారు. ఓ అధికారిణి ఇంటిపై దౌర్జన్యం చేసిన వ్యక్తిపై సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం ఏంటని ప్రశ్నించారు.

వర్ల

By

Published : Oct 6, 2019, 6:51 PM IST

మీడియా సమావేశంలో వర్ల రామయ్య
ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యం కేసులో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయటంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య మండిపడ్డారు. తెల్లవారు జామున కోటంరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు 5 గంటల్లోనే బెయిల్​పై విడుదల చేయటం దుర్మార్గమని అన్నారు. ఎవరి ఆదేశాలతో పోలీసులు ఈ బూటకపు అరెస్టు నాటకాన్ని రక్తి కట్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారిణిపై ఓ శాసనసభ్యుడి రాద్ధాంతం ఘటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details