ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్ర నిధులపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు : కాకాని గోవర్థన్ - nellore ycp leaders comments on tdp

కేంద్ర పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకున్న తెదేపాకు కేంద్ర నిధులపై మాట్లాడే అర్హత లేదని నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు సభలకు తెదేపా.. జనాన్ని వాహనాల్లో తరలించేదని... కానీ వైకాపా రైతు భరోసా సభకు రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. రైతు భరోసా సభను విజయవంతం చేసినందుకు జిల్లా రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర నిధులపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు : కాకాని గోవర్థన్

By

Published : Oct 16, 2019, 9:43 PM IST

కేంద్ర నిధులపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు : కాకాని గోవర్థన్
రైతుభరోసా సభను విజయవంతం చేసిన జిల్లా రైతులకు నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన... రైతు భరోసా వంటి చారిత్రక పథకం ప్రారంభించడానికి జిల్లాను వేదికగా చేసుకున్నందుకు సీఎం జగన్​కు రైతులందరూ రుణపడిఉంటారన్నారు. తాను చేయలేని పనిని సీఎం జగన్ చేస్తున్నారనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ చేయకుండా రైతులను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి తమ పథకాలుగా తెదేపా ప్రచారం చేసుకుందని ఆరోపించారు.

కనీసం రైతుభరోసా పథకాన్ని మెచ్చుకుంటే చంద్రబాబు గ్రాఫ్ కొంచమైన పెరిగేదన్నారు. చంద్రబాబు సభకు ట్రాకర్లు, లారీల్లో జనాన్ని తరలించేవారిని... కానీ వైకాపా రైతు భరోసా సభకు రైతులే స్వచ్ఛందంగా తమ సొంత వాహనాల్లో తరలివచ్చారన్నారు కాకాని. ప్రభుత్వం నుంచి ఎక్కడా ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు వినియోగించలేదన్నారు. రైతు భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి జిల్లాకు ఇచ్చిన హామీలపై ఆనందం వ్యక్తంచేశారు.

ABOUT THE AUTHOR

...view details