వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కరోనా - సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మేల్యేకు కరోనా
వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కరోనా సోకింది. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చరవాణి ద్వారా అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.
వైకాపా ఎమ్మెల్యేకి కరోనా
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. చరవాణి ద్వారా అందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.