నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని రవితేజ కళ్యాణమండపంలో ఎన్నికలపై వైకాపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కార్యకర్తలతో సమీక్షించారు. నియోజకవర్గంలో తెదేపా నుంచి వైకాపాలోకి చేరిన వారికి ఆహ్వానం పలికారు. జరగనున్న ఎన్నికల్లో మొదటి నుంచి పార్టీకి సేవ చేసిన వారికి పదవులు ఇస్తామని మంత్రి భరోసానిచ్చారు. గెలిచివారు ప్రజలకు సేవ చేయాలని సూచించారు. మొదటిసారి అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూసేలా మద్యం, డబ్బు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారని అన్నారు. ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా పనిచేసి జరగబోయే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరారు.
'ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ సైనికుడిలా పోరాడాలి' - నెల్లూరులో ఎన్నికలపై వైకాపా నేతల సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలపై చర్చలు, సమావేశాలు మొదలయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైకాపా కార్యకర్తలు సమావేశమయ్యారు. ఎన్నికల్లో వైకాపా గెలిపొందేలా ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు.
!['ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ సైనికుడిలా పోరాడాలి' ycp memebers meeting for local body elections at athmakuru in nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6357005-181-6357005-1583824197393.jpg)
ycp memebers meeting for local body elections at athmakuru in nellore
ఆత్మకూరులో వైకాపా కార్యకర్తల సమావేశం