ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి ఉపఎన్నిక...పోటాపోటీగా ప్రచారాలు - గురుమూర్తి వార్తలు

తిరుపతి లోక్​సభ ఉపఎన్నికలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మీ దూసుకుపోతున్నారు.

YCP leaders meeting in Naidupeta
ప్రచారంలో వైకాపా నేతలు

By

Published : Mar 29, 2021, 9:52 PM IST

తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తిరుపతి పార్లమెంటు వైకాపా అభ్యర్థి గురుమూర్తి, ఆ పార్టీ ప్రధాన నాయకులు వై.వి.సుబ్బారెడ్డి, మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు నాయకు‌లు పాల్గొన్నారు. ప్రతి బూతు పరిధిలో మెజారిటీ తెచ్చుకోవడం చాలా ముఖ్యమన్నారు.

ప్రచారంలో దూసుకుపోతున్న పనబాకలక్ష్మీ

తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏడు నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేయడానికి నిరంతరం కష్ట పడుతున్నారు. తెదేపాకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.

'ఎమ్మార్పీఎస్​ను రాజకీయపార్టీగా మార్చబోతున్నాం'

అగ్రవర్ణ పార్టీలు తమను మోసగించటంతో తిరుపతి ఉప ఎన్నికల బరిలో దిగిన తాము.. ఎమ్మార్పీఎస్​ను రాజకీయ పార్టీగా మార్చబోతున్నట్లు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాదిగ ప్రకటించారు. వచ్చే నెల ఆరో తేదీన తిరుపతిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన నెల్లూరులో తెలిపారు. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి హాజరవుతున్న ఎమ్మార్పీఎస్ నాయకులు, రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. తిరుపతి ఎంపీ స్థానంలో పోటీకి దిగిన తనను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఇదీ చదవండి:

భద్రాద్రి రామయ్య కల్యాణానికి... కోటి తలంబ్రాల దీక్ష

ABOUT THE AUTHOR

...view details