ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో.. సచివాలయంలో వైకాపా నేత వీరంగం - వెంకట్రావుపల్లి సచివాలయంలో మద్యం సేవించి వచ్చిన వైకాపా నేత హల్​చల్​

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక.. ఆండ్ర సుబ్బారెడ్డి అనే వైకాపా నేత ఓటర్లను దుర్భాషలాడుతూ తిరుగుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘంలోని వెంకట్రావుపల్లిలో మద్యం సేవించి సచివాలయంలో చిందులు తొక్కారు.

ycp leader create issue in venkatravupalli ward sachivalayam
వెంకట్రావుపల్లిలో మద్యం మత్తులో సచివాలయంలో వైకాపా నేత వీరంగం

By

Published : Mar 20, 2021, 9:25 PM IST

మద్యం మత్తులో దుర్భాషలాడుతున్న ఆండ్ర సుబ్బారెడ్డి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని వెంకట్రావుపల్లి సచివాలయంలో.. వైకాపా నేత ఆండ్ర సుబ్బారెడ్డి మద్యం సేవించి చిందులు తొక్కారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తన ఓటమికి.. సొంత పార్టీ నాయకులే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ శ్రావణ్ కుమార్​ వల్లే తాను గెలవలేకపోయానని ఆరోపించారు.

వార్డ్ కౌన్సిలర్​గా పోటీచేసిన ఆండ్ర సుబ్బారెడ్డి.. ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి శివకోటా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి మద్యం సేవించి వీధుల్లో తిరుగుతూ ఓటర్లను నిందిస్తున్నారు. ఇప్పుడు సచివాలయంలోకి వెళ్లి సిబ్బందిని దుర్భాషలాడుతూ చిందులేశారు. ఈ తతంగాన్ని కొందరు సెల్ ఫోన్​తో చిత్రీకరించడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో స్థానికంగా వైరల్ అయింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details