నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో నిర్మిస్తున్న జగనన్న పక్కా ఇళ్లకు వైకాపా రంగులు వేస్తున్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇక్కడ మోడల్ గా నిర్మించిన ఇళ్లకు వైకాపా రంగులు వేయించారు. స్థానిక అయ్యపరెడ్డిపాళెంలో 330 నివాసాలకు స్థలాలు పంపిణీ చేశారు. అధికారుల ఒత్తిడి తో ఇక్కడ 50 నుంచి 100 మంది బేస్ మెంట్ వేస్తున్నారు. శ్రీనివాసపురం వద్ద 744 లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారు. 100 బేస్మెంట్లు వేస్తున్నారు. గుత్తేదారులు ద్వారా వీటిని నిర్మిస్తున్నారు. అయితే గుత్తేదారులు బేస్ మెంట్లు కట్టేందుకు నగదు ఇవ్వాలని.. లేకపోతే పట్టాలు తిరిగి ఇవ్వాలని ఇబ్బందులు పెడుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
జగనన్న పక్కా ఇళ్లకు వైకాపా రంగులు - jagananna houses in nellore district
నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో నిర్మిస్తున్న జగనన్న పక్కా ఇళ్లకు వైకాపా రంగులు వేశారు. గుత్తేదారులు ద్వారా వీటిని నిర్మిస్తున్నారు.
జగనన్న పక్కా ఇళ్లకు వైకాపా రంగులు