BYELECTION: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 24.92 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి కుటుంబంతో కలిసి ఓటేశారు. అనంతరం మాట్లాడుతూ... పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. దాదాపు 70 నుంచి 72 శాతం పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ఆత్మకూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
BYELECTION: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి కుటుంబంతో కలిసి ఓటేశారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బట్టేపాడులో ఉద్రిక్తత.. పోలీసులు, స్వతంత్ర అభ్యర్థి శశిధర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం:ఆత్మకూరు మండలం బట్టేపాడు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైకాపా నేతలు పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ.. అక్కడే ఉన్న స్వతంత్ర అభ్యర్థి తూమాటి శశిధర్ రెడ్డి ఆరోపించారు. పోలింగ్ స్టేషన్లోకి వెళ్తున్న వైకాపా నేతలను పోలీసులు అడ్డుకోకుండా.. తననే నిలువరించే ప్రయత్నం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు.. శశిధర్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ స్వతంత్ర అభ్యర్థి అభ్యర్థి మండిపడ్డారు.
ఇవీ చదవండి: