ప్రతి ఒక్కరికీ ఆనందయ్య ఆయుర్వేద మందు అందుతుందని యాదవ సంఘం జిల్లా నాయకుడు సంపత్ యాదవ్ అన్నారు. రెండు రోజుల్లో అన్ని అనుమతులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆనందయ్య శిష్యులు ఎప్పుడు కరోనా బాధితులకు సేవలు చేస్తూ.. అతి దగ్గరగా ఉండడంవల్ల ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చి ఉంటుందన్నారు. దానిని మీడియా భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేదన్నారు.. మీడియా ప్రతినిధులు పనిగట్టుకొని వ్యతిరేక వార్తలు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు.
Anandaiah Medicine: 'రెండు రోజుల్లో అన్ని అనుమతులు వస్తాయి' - ఆనందయ్య మందుపై యాదవ సంఘం జిల్లా నాయకుడు సంపత్ యాదవ్ వ్యాఖ్యలు
రెండు రోజుల్లో ఆనందయ్య మందుకు అన్ని అనుమతులు వస్తాయని యాదవ సంఘం నెల్లూరు జిల్లా నాయకుడు సంపత్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ ఆనందయ్య ఆయుర్వేద మందు అందుతుందని.. అందరూ సంయమనం పాటించాలని కోరారు.
యాదవ సంఘం జిల్లా నాయకుడు సంపత్ యాదవ్