ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాంధీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఎదుట మహిళల ధర్నా - నెల్లూరు నగరం గాంధీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల న్యూస్

నెల్లూరు నగరం గాంధీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో వాచ్​మెన్ నియామక వ్యవహారం వివాదాస్పదమైంది. పనిలో నుంచి తొలగించేందుకు ప్రధానోపాధ్యాయుడు ప్రయత్నిస్తున్నారని పూర్ణ అనే మహిళ ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని బాధితురాలు వాపోయారు.

Women's dharna in front of Nellore city Gandhinagar Municipal Primary School
గాంధీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల మహిళల ధర్నా

By

Published : Feb 17, 2021, 10:03 PM IST

నెల్లూరు నగరం గాంధీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో స్వీపర్ కం వాచ్​మెన్ నియామక వ్యవహారం వివాదాస్పదమౌతోంది. గత ఐదేళ్లుగా వాచ్​మెన్​గా పని చేస్తున్న తనకు తొమ్మిది నెలలుగా వేతనాలు సక్రమంగా ఇవ్వడంలేదని పూర్ణ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. పనిలో నుంచి తొలగించేందుకు ప్రధానోపాధ్యాయుడు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు.

ఈరోజు పాఠశాల వద్ద పూర్ణ స్పృహ తప్పి పడిపోవడంతో, స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధానోపాధ్యాయుడి తీరును ఖండిస్తూ, పూర్ణకు న్యాయం చేయాలని మహిళలు ధర్నా చేపట్టారు. ఐదేళ్లుగా ఆమె వాచ్​మెన్​గా పని చేస్తున్నట్లు పూర్ణ చెప్పడం అవాస్తవమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రహ్మతుల్లా చెప్పారు. ఇక్కడ వాచ్​మెన్​గా మరో మహిళను నియమించారని తెలిపారు.

ఇదీ చదవండి:

భార్యాభర్తలు.. పల్లె పాలకులు!

ABOUT THE AUTHOR

...view details