భారీ సెట్టింగులతో నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఉట్టి మహోత్సవం కోలాహలంగా జరిగింది. ఇక్కడ ప్రతిఏటా మహిళలే ఉట్టి కొట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాదీ ఉట్టి మహోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహంగా ఉట్టి కొడుతూ సందడి చేశారు. నలువైపుల నుంచి నీళ్లు కొడుతూ, ఉట్టి పగలగొట్టేందుకు మహిళలు పోటీపడ్డారు. ఈ ఉట్టి మహోత్సవాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఉట్టి కొట్టేందుకు మహిళలు పోటాపోటీ...
వినాయకుని నవరాత్రులు వచ్చిందంటే చాలు..అక్కడ మహిళలు ఉట్టికొట్టే మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా!
womens are celebrating utti festival in nellore womens are celebrating utti festival in nellore