ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొంగ బాబాపై చర్యలు తీసుకోవాలి.. మహిళా సంఘాల నిరసన - Nellore Latest News

Nellore Hazrat Dargah President Hafees Bhasha : పెళ్లి చేసుకుంటానని యువతులను లోబర్చుకుని.. మోసం చేస్తున్నాడనే ఆరోపణలపై.. నెల్లూరు హజరత్ దర్గా పీఠాధిపతి హఫీస్ భాషాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా హఫీస్ భాషా మహిళలను చేస్తున్న మోసాలను ఖండిస్తూ మహిళా సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దొంగ బాబా హఫీస్ భాషాను పీఠాధిపతి పదవి నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు. నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టి విచారణ జరిపించి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Baba Hafiz Frauds
Baba Hafiz Frauds

By

Published : Feb 13, 2023, 10:23 PM IST

హఫీస్ భాషా మహిళలను చేస్తున్న మోసాలను ఖండిస్తూ.. మహిళా సంఘాలు నిరసన

Nellore Hazrat Dargah President Hafees Bhasha : నెల్లూరు జిల్లా ఏఎస్ పేట దర్గా పీఠాధిపతిగా ఉన్న దొంగ బాబా హఫీజ్ పెళ్లిళ్ల పేరిట మహిళలను చేస్తున్న మోసాలను ఖండిస్తూ మహిళా సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దొంగ బాబా హఫీస్ బాషాను పీఠాధిపతి పదవి నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు. భక్తి శ్రద్ధలతో అనేక ఇబ్బందులతో దర్గాకు వచ్చిన భక్తులను తన మాయమాటలతో లోబరుచుకొనేవాడని ఇప్పటికే స్థానికులు ఆరోపిస్తున్నారు.

దెయ్యం పట్టిందనో లేక ఆరోగ్యం బాగాలేదనో దర్గాకు వచ్చిన యువతులను లోబర్చుకుని కుదిరితే లైంగికంగా అనుభవిస్తూ.. మాయ మాటలు చెబుతూ పెళ్లిళ్లు చేసుకునేవాడని ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. దర్గా లోపల వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న మహిళలను దొంగ బాబా అనుచరులు అడ్డుకుని గొడవకు దిగారు. దీంతో దర్గా ఆవరణలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

ఏడు పెళ్లిళ్లు చేసుకుని ఎనిమిదో పెళ్లికి సిద్ధమై దొంగ బాబా ఆఫీస్ బాషాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా దొంగబాబాపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి విచారణ జరిపించి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details